: తను భూస్థాపితం కావాలని కోరుకుంటేనే, కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంది: వీరశివారెడ్డి


రాష్ట్రంలో తను భూస్థాపితం కావాలని కోరుకుంటేనే... కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి సాహసిస్తుందని కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం సమైక్యంగా ఉంటే 20 ఎంపీ స్థానాలను గెలిపిస్తామని అన్నారు. సమైక్యాంధ్రపై నోరు విప్పని సీమాంధ్ర ఎంపీలు, మంత్రులను తరిమి కొడతామని హెచ్చరించారు. వీరశివారెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News