: రాకుమార్తెలకు కలిసొచ్చిన రూ.20,000కోట్లు
ఫరీద్ కోట్ మాజీ మహారాజు కుమార్తెల న్యాయపోరాటం ఫలించింది. రాజ్యానికి సంబంధించి సుమారు 20,000వేల కోట్ల రూపాయల ఆస్తులను వారికి స్వాధీనం చేయాలని చండీగఢ్ చీఫ్ జ్యుడీషియల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారి న్యాయపోరాటం ఫలించింది.
పంజాబ్ లోని ఫరీద్ కోట సంస్థానం రాజు హరీందర్ సింగ్ బ్రార్ కు ఢిల్లీ, హైదరాబాద్ నగరాలలో ఆస్తులు, ఫరీద్ కోట్ లో ఒక కోట, బంగారం ఇలా ఎంతో సంపద ఉంది. వీటి విలువ 20,000కోట్ల రూపాయలని అంచనా. స్వాతంత్ర్యానంతరం కూడా ఈ ఆస్తులను ప్రభుత్వాలు హరీందర్ సింగ్ కే వదిలేశాయి. బ్రార్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు హర్ మోహిందర్ సింగ్ 1981లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించచడంతో బ్రార్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. దీంతో సర్వెంట్లు బ్రార్ తో సంతకాలు పెట్టించుకుని ఆస్తులను మెహర్వాల్ కేజ్రీవాల్ ట్రస్ట్ కు 1982లో బదిలీ చేశారని బ్రార్ కుమార్తె అమిత్ కౌర్ కోర్టుకు తెలిపారు. 1989లో తన తండ్రి చనిపోయాక తమ పనివారే ఆ ట్రస్ట్ నిర్వహణను చేతుల్లోకి తీసుకున్నారని వివరించారు.
దీన్ని అక్రమంగా కోర్టు తేల్చింది. ఉద్దేశ పూర్వకంగా రాజు వద్ద నుంచి సంతకాలు తీసుకుని, ఫోర్జరీకి పాల్పడ్డారని స్పష్టం చేస్తూ రాజు ఆస్తులను ఆయన కుమార్తెలకు స్వాధీనం చేయాలని ఆదేశించింది. బ్రార్ కుమార్తె ముగ్గురిలో మహీపిందర్ కౌర్ 2001లో చనిపోయారు. ఇక మిగిలింది ఇద్దరే కావడంతో 20,000కోట్ల రూపాయల ఆస్తులు వారి పరం కానున్నాయి.