: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం, చంద్రబాబు
తెలంగాణ సంప్రదాయ లష్కర్ బోనాల ఉత్సవ సందర్భంగా ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోక్ సత్తా పార్టీ అధ్యకుడు జయప్రకాశ్ నారాయణ, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ, డీజీపీ దినేష్ రెడ్డిలు దర్శించుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు సరిపడా పడాలని, పంటలు బాగా పండాలని, శాంతి భధ్రతలు బాగుండాలని, మరింత అభివృద్ధి చెందాలని వీరంతా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారు జాము నుంచే భారీగా భక్తులు తరలి వస్తుండడంతో అమ్మవారి ఆలయానికి దారితీసే మార్గాలన్నీ కోలాహలంగా మారాయి. కాగా అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి వెంట దానం, ముఖేష్ గౌడ్ కూడా ఉన్నారు.