: 'మోడీ' బ్రాండ్ స్మార్ట్ ఫోన్


ఇకపై మోడీ నామం స్మార్ట్ ఫోన్లలోనూ ప్రతిధ్వనించనుంది. మోడీ అభిమానులు ఏకంగా నమో పేరుతో ఒక స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. నమోలో న అంటే నరేంద్ర, మో అండే మోడీ. అభిమానులు నమో అని మోడీని పిలుచుకుంటారు. కొంత మంది ఔత్సాహిక అభిమానులు వ్యాపారులుగా మారి, నమో బ్రాండ్ పేరుతో అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి రెడీ అయిపోయారు. తద్వారా మోడీ నామాన్ని మరింత వ్యాపితం చేయాలన్నది వారి ప్రగాఢ ఆంకాక్ష.

నమో స్మార్ట్ ఫోన్లో 5 అంగుళాల గొరిల్లా గ్లాస్ 2 స్క్రీన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్ క్రోర్ ప్రాసెసర్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సెల్ కెమెరా, 1 జిబి ర్యామ్ ఇలా ఎన్నో ఫీచర్లు ఉంటాయి.దీనికితోడు నరేంద్రమోడీకి సంబంధించిన అప్లికేషన్లు కూడా ఉంటాయి. ఈ నమో స్మార్ట్ ఫోన్ ధర 16,000 రూపాయలు.

త్వరలోనే శ్రీ నరేంద్ర మోడీ సిగ్నేచర్ ఎడిషన్ పేరుతో ఒక హాండ్ సెట్ ను ప్రత్యేకంగా విడుదల చేసే పనిలో ఉన్నారు. చైనాలో వ్యాపారం నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ అభిమాని అమీత్ దేశాయ్ ఈ నమో స్మార్ట్ ఫోన్ వ్యాపార బృందంలో కీలక వ్యక్తిగా ఉన్నారు. ఎలాంటి లాభం లేకుండా ఈ స్మార్ట్ ఫోన్ విక్రయించాలన్నది వీరి యోచన. తక్కువ ధరల్లో కూడా స్మార్ట్ ఫోన్లను తీసుకురావాలనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News