: మోడీ, అద్వానీ తమ జీవిత కాలంలో ప్రధాని కాలేరు: లాలూ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ సీనియర్ నేత అద్వానీ వారి జీవిత కాలంలో దేశానికి ప్రధానమంత్రి కాలేరని ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. లౌకిక శక్తులు బీజేపీని అధికారంలోకి రానీయవని చెప్పారు. ఈ మేరకు వారణాసిలో లాలూ మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఈ దేశాన్ని మార్చాలనుకుంటున్నారని భజన చేశారు. దిగ్విజయ్ చాలా మంచోడని కితాబిచ్చారు.