: జంట నగరాలకు బోనాల కళ
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బోనాల ఉత్సవాలు జంట నగరాలలో నేటి నుంచి సోమవారం వరకు రెండు రోజుల పాటు జరగనున్నాయి. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల జాతర ఈ తెల్లవారు జామున ప్రారంభమైంది. భక్తులు ఈ రోజు అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. రేపు రంగం జరుగుతుంది. ఈ సందర్భంగా భవిష్యత్తు గురించి అవివాహిత మహిళ తెలియజేస్తుంది. రెండు రోజుల పాటు జరిగే జాతరకు లక్షల మంది వస్తారని అంచనా.. ఈ ఆలయంతోపాటు జంట నగరాలలోని 40 వరకూ అమ్మవారి ఆలయాలలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం వివిధ శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. మరోవైపు, రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డి ఈ ఉదయం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.