: అపర కీచకుడికి వెయ్యేళ్ల జైలు శిక్ష
ముగ్గురు మహిళలను నిర్భంధించి చెరబట్టిన అపర కీచకుడికి క్లీవ్ లాండ్ న్యాయస్థానం వెయ్యేళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికాలోని ఓహియోలో ముగ్గురు యువతులు అదృశ్యమవడం సంచలనం సృష్టించింది. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు చేయని ప్రయత్నం లేదు. వారి ఫోటోలతో ఎక్కి దిగని గడప లేదు. దీంతో వారి పేర్లు అక్కడ మార్మోగిపోయాయి. చివరకు అందరూ వారిని మర్చిపోయారు కూడా. ఇక దొరకరని భావించారు. కానీ, మేలో వారు ఆ కీచకుడి చెర నుంచి అదృష్టవశాత్తు తప్పించుకుని బయటపడ్డారు. ఆ వార్త విని ఓహియోలోని ప్రజలంతా ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఇన్నాళ్లూ వారిని బందీలుగా ఉంచిన ఏరియల్ క్యాస్ట్రో బందీగా పోలీసులకు చిక్కాడు. తాను అశ్లీల ప్రవర్తనకు బానిసయ్యానని న్యాయస్థానంలో ఒప్పుకున్నాడు. దీంతో న్యాయస్థానం అతడికి మరణశిక్షకు బదులుగా జీవిత ఖైదు విధించింది.