: 13 మృతదేహాల అప్పగింత
హైదరాబాదు, దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్లలో మరణించిన 15 మందిలో 13 మందిని గుర్తించారు. మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. మృతుల వివరాలు... ఆనంద్ (బీటెక్), ముత్యాల రాజశేఖర్ (ఎంబీఏ), కోరేటి స్వప్నా రెడ్డి (ఎంబీఏ), ఎ.రాములు (వారాసి గూడ), వెంకటేశ్వరరావు (కోరుకొండ) తిరుపతయ్య (గోదావరి ఖని), వి.విజయ్ కుమార్ (ఆదిలాబాద్ జిల్లా నంనూర్) శ్రీనివాసరెడ్డి (రెంటచింతల), మహ్మద్ రఫీ (బాబా నగర్ చాంద్రాయణ గుట్ట), హరీశ్ కార్తీక్ (దిల్ సుఖ్ నగర్ స్వగ్రామం జడ్చర్ల), పద్మాకర్ దివాన్ జీ (కొత్తపేట జిలేబీ తయారీదారు), ఆనంద్ కుమార్ (బీటెక్, స్వగ్రామం అనంతపురం), చోగారం కులాజీ (రాజస్థాన్), ఎజాద్ అహ్మద్ (ప్రేమ్ నగర్).
కాగా, ఇంకా రెండు మృతదేహాలు గుర్తు పట్టకుండా ఉన్నాయని వైద్యులు, పోలీసులు చెబుతున్నారు. వారికోసం -94906 16400 ఫోన్ నంబరును సంప్రదించాలని ఆసుప్రతి సిబ్బంది తెలిపారు. మరోవైపు పేలుళ్ల ఘటనలో గాయపడిన వారు నగరంలోని 8 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న14 మందిలో 7గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేర్ ఆసుపత్రిలో ఉన్న 20 మందిలో ముగ్గురి పరిస్థితి, ఒమ్నీ ఆసుపత్రిలో 18 మంది చికిత్స పొందుతుండగా ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.