: సైనిక శక్తిని ప్రదర్శించిన ఉత్తర కొరియా
కొరియా యుద్ధం ముగిసి 60 ఏళ్లయిన సందర్భంగా ఉత్తరకొరియా భారీస్థాయిలో సైనిక పాటవాన్ని ప్రదర్శించింది. రాజధాని ప్యోంగ్ యాంగ్ లో జరిగిన సైనిక కవాతులో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ యున్ పాల్గొని సైనిక దళాల వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు, అతిథులు, పశ్చిమ దేశాల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.