: జగన్ పార్టీకి 'సైకిల్' షాక్
తొలి విడత ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లాలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను వెనక్కినెట్టిన వైఎస్సార్సీపీకి రెండో విడత ఎన్నికల ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. తాజా సమాచారం ప్రకారం విశాఖ జిల్లాలో టీడీపీ మద్దతు పలికిన సర్పంచు అభ్యర్థులు 15 మంది నెగ్గగా.. జగన్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 4 మందే నెగ్గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ వర్గీయులు 9 పంచాయతీల్లో జయకేతనం ఎగురవేశారు.