: షర్మిలపై టీడీపీ ఫిర్యాదు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ షర్మిలపై టీడీపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ లో ఈమేరకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు 48 గంటల ముందు ప్రచారం ముగించాలని నిబంధన ఉన్నా, షర్మిల అందుకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. కడప జిల్లా పుల్లంపేట మండలం బత్తూరులో రిగ్గింగ్ కు పాల్పడిన వైఎస్సార్సీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసరలో పోలీసులు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.