: నలుగురు ఇండో-అమెరికన్లకు సైన్సు, గణిత అవార్డులు


సైన్సు, గణితంలో చేస్తున్న కృషికిగానూ నలుగురు ఇండో-అమెరికన్ ప్రొఫెసర్లకు అమెరికాలోని సిమోన్స్ ఇన్వెస్టిగేటర్స్- 2013 అవార్డు లభించింది. వీరితో పాటు మరో తొమ్మిది మందికి కూడా ఈ ఫెలోషిప్ అవార్డును ప్రకటించారు. వీరంతా ప్రస్తుతం అమెరికాలోని స్టాన్ ఫర్డ్, హార్వర్డ్, పెన్సిల్వేనియా యూనివర్శిటీ, మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో థియరిటికల్ ఫిజిసిస్ట్స్, థియరిటికల్ కంప్యూటర్ సైంటిస్టులుగా పని చేస్తున్నారు. సుదీర్ఘకాలం పాటు వారు సాగించబోయే పరిశోధనకు గానూ ప్రతి ఒక్కరికి ఐదు సంవత్సరాలు రూ.59 లక్షలు ఇవ్వనున్నారు. ఈ ఫెలోషిప్ అవార్డును న్యూయార్క్ కు చెందిన 'సిమోన్స్ ఫౌండేషన్' బహుకరించనుంది.

  • Loading...

More Telugu News