: ధర్నాకు దిగిన దేవినేని ఉమ
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో ఒకే చిరునామాతో 250 ఓట్లు ఉండడంపై తీవ్ర దుమారం చెలరేగింది. గ్రామంలో పోలింగ్ నిలిచిపోగా, అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై టీడీపీ ఆందోళనకు దిగింది. స్థానికేతరులు ఓట్లేస్తుండడం పట్ల మూలపాడు గ్రామస్తులు అభ్యంతరం చెబుతుండడంతో అక్కడ ఘర్షణ వాతావరణ నెలకొంది. దీంతో, టీడీపీ వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ కూడా వారికి సంఘీభావంగా ధర్నాకు దిగారు.