: దూసుకెళ్తున్న టీమిండియా..2-0 తో ముందంజ


టీమిండియా యువ క్రికెటర్ల అండతో దూసుకెళ్తోంది. జింబాబ్వేలో అందివచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు టీమిండియా కొత్త కుర్రాళ్లు. తొలి వన్డేలో రాయుడు రాణిస్తే, రెండో వన్డేలో ఉనద్కత్ సత్తా చాటాడు. వ్యక్తిగతంగా నిలకడ చూపుతూ జట్టుగా ఉత్తమ ఫలితాలందుకుంటున్నారు భారత ఆటగాళ్లు. జింబాబ్వే పర్యటనలో జరిగిన రెండో వన్డేలో 58 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును టీమిండియా చిత్తు చేసింది. దీంతో, సిరీస్ లో 2-0 ఆధిక్యాన్ని భారత జట్టు సంపాదించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 65 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడ్డ టీమిండియాను ధావన్(116), కార్తీక్ (69) సమయోచిత ఇన్నింగ్స్ తో ఆదుకున్నారు. ధావన్ ఎప్పట్లాగే బ్యాటు ఝుళిపించగా, అతనికి అండగా కార్తీక్ నిలిచాడు. దీంతో శిఖర్ గత 10 నెలల్లో 3 సెంచరీలు నమోదు చేసి అత్యధిక పరుగుల వ్యక్తిగత రికార్డు సవరించుకున్నాడు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే భారత్ కు దీటుగా ఆడింది. ఓపెనర్లు భారత్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. జింబాబ్వే బ్యాట్స్ మెన్ లో సిబంద(55), ఉత్సెయ(52 నాటౌట్), చిగుంబుర(46) రాణించారు. నిలకడగా ఆరంభమైన జింబాబ్వే బ్యాటింగ్ క్రమంగా వికెట్లు కోల్పోయి చేతులెత్తేసింది. హ్యాట్రిక్ అవకాశాన్ని కోల్పోయిన ఉనద్కత్ నాలుగు వికెట్లు తీసి రాణించగా, అతనికి మిశ్రా చక్కని సహకారమందించాడు. దీంతో, జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 236 పరుగులే చేయగలిగింది. దీంతో 58 పరుగుల తేడాతో జింబాబ్వే ఓడిపోయింది. కాగా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా శిఖర్ ధావన్ నిలిచాడు. కోహ్లీ ఔట్ పై వివాదం చెలరేగింది. మూడో వన్డే రేపు జరుగనుంది

  • Loading...

More Telugu News