: ధోనీ మాతో ఉన్నందుకే ఓర్వలేకున్నారు: శ్రీనివాసన్
మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా ఉండడం చూసి ఓర్వలేకే ఇటీవల తనపై ఆరోపణల దాడి జరిగిందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో తన మేనల్లుడు గురునాథ్ మీయప్పన్ పేరు బయటకు రావడంతో తప్పనిసరై శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ పరిణామాలను ఉద్ధేశించే శ్రీనివాసన్ చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా మొదటిసారిగా మాట్లాడారు. టీమిండియా కెప్టెన్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నేతృత్వం వహిస్తుండడంతో భరించలేకపోతున్నారని మండిపడ్డారు. ఒక వేళ ధోనీని వదులుకుంటే విరోధులు కిమ్మనకుండా ఉండేవారని అన్నారు. శ్రీనివాసన్ ఆధ్వర్యంలోని ఇండియా సిమెంట్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఫ్రాంచైజీ ఉన్న సంగతి తెలిసిందే.