: లండన్‌లో కోడిపుంజు గారి కొత్త వివాదం


జర్మన్‌ శిల్పకారిణి కెథరినా ఫ్రిట్స్‌ అనే అమ్మడికి ఓ చిలిపి ఆలోచన వచ్చింది. అందుకు ఆమె అనువుగా ఎన్నుకున్న స్థలం.. ఒకప్పటి ఇంగ్లండు వీరుల శౌర్యధైర్యాలకు ప్రతీకగా నిలుస్తున్నట్టి స్థలం. ఇంగ్లండు వాసులు అంతటి ప్రతిష్ఠాత్మక స్థలంగా భావించే చోట ఈ అమ్మడు చిలిపి ఆలోచన ఇంప్లిమెంట్‌ చేయడంతో.. ఇప్పుడు వివాదం రేకెత్తుతోంది.

విషయం ఏంటంటే.. లండన్‌లో ట్రఫాల్‌గర్‌ స్క్వేర్‌ అని ఓ కూడలి ఉంది. గతంలో ఫ్రాన్స్‌పై ఇంగ్లండ్‌ గెలిచినప్పుడు ఆ స్మారకంగా దాన్ని ఏర్పాటుచేశారు. ఆ స్థలం చుట్టూ యుద్ధంలో హీరోలుగా నిలిచిన వీరాధి వీరుల విగ్రహాలు నెలకొల్పారు. వాటి మధ్యలో ఇప్పుడు ఓ వైపుగా భారీ స్థాయిలో అయిదు అడుగుల ఎత్తున్న అందమైన నీలిరంగు కోడిపుంజు విగ్రహాన్ని సదరు శిల్పకారిణి ఏర్పాటు చేసింది. ఈ పుంజుగారి వల్ల వీరాధివీరుల ఇమేజి దెబ్బతినే ప్రమాదం ఉన్నదంటూ పాపం.. లండన్‌ వాసులు బాధపడుతున్నారు. పైగా ఈ పుంజుగారి బొమ్మకు 'కాక్‌' అంటూ పేరెట్టారు. పేరు నిజమే కావొచ్చు గానీ.. ఆ పదం కొందరికి బూతు అర్థం కూడా ధ్వనించే ప్రమాదం ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News