: 1.8 లక్షల కోట్ల కి.మీ.ల ప్రయాణం ఆగింది..


1.8 లక్షల కోట్ల కిలోమీటర్ల ప్రయాణాన్ని అడ్డుకోవడం అంటే.. అది ఎంత ఉధృత స్థాయిలో ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ప్రయాణం ఆపడం అంటే మహా అయితే ఒకటి రెండు కిలోమీటర్ల ప్రయాణం ఆపడం సాధ్యం అవుతుంది. అయితే శాస్త్రవేత్తలు ఏకంగా 1.8 లక్షల కోట్ల కి.మీ.ల ప్రయాణం స్థంభింపజేశారు. అయితే వారు ఈ కసరత్తు చేసినదెల్లా కేవలం ఒక్క నిమిషం పాటు మాత్రమే. ఒక్క నిమిషంలో కాంతి అంత దూరం ప్రయాణిస్తుంది. అయితే విశ్వంలో అంత వేగంతో ప్రయాణించే కాంతిని జర్మనీలోని డార్మ్‌స్టాట్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం ఒక నిమిషం పాటు ఆపేసింది.

పారదర్శకతలేని ఒక క్రిస్టల్‌ మీదికి లేజర్‌ కిరణాలను ప్రసరింపజేసి ఈ ప్రయోగం చేశారు. ఇలా పంపడం వల్ల స్ఫటిక కాంతి కిరణాల్లో వచ్చే మార్పు`చేర్పులను ఆధారం చేసుకుని.. ఒక కాంతిపుంజాన్ని నిలిపివేశారు. ఆ స్థితిలో కాంతి ఎటూ ప్రయాణించకుండా ఒక నిమిషం పాటూ అలా స్థంభించిపోయింది. నిలిచి ఉండేలా శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది ఈ రంగంలో ఇప్పటిదాకా అరుదైన ప్రయోగం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News