: లోటస్ పాండ్ లో తెలంగాణ నేతలతో విజయమ్మ మంతనాలు
లోటస్ పాండ్ లో తమ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత నేతలతో వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ భేటీ అయ్యారు. సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారంపై తెలంగాణ ప్రాంత నేతల అసంతృప్తి దృష్ట్యా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని విజయమ్మ స్పష్టం చేశారు. విద్యుత్ ధరల పెంపుకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలో జై తెలంగాణ నినాదాలు కూడా చేశారు. తాజాగా సీమాంధ్ర వైఎస్సార్సీపీ నేతలు మూకుమ్మడిగా రాజీనామాకు దిగడంతో, పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా లేదని చెప్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు.