: రాష్ట్రంలోని యువతరం భావాలివి
రాష్ట్రంలోని యువతరం సక్రమ మార్గంలో నడుస్తోందా? లేదా? యువత ఆలోచనలేంటి? ఎవరి ఫ్యాషన్ అనుకరిస్తారు? ఎవర్ని ఆదర్శంగా తీసుకుంటారు? అమ్మాయిలు, అబ్బాయిల మధ్య స్నేహం అవసరమా లేదా? రాజకీయాలపై వారి విధానమేంటి? భవిష్యత్ లక్ష్యమేంటి? అనే పలు ఆసక్తికర అంశాలపై ఓ ప్రాంతీయ పత్రిక సర్వే చేసింది అందులో 300 మంది యువత పాల్గొని వారి ఆలోచనల్ని ఆవిష్కరించారు.
యువతరం పురోగతికి ప్రధాన ప్రతిబంధకం ఇంటర్నెట్ అని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. యువతరం రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్న దానికి కచ్చితంగా రావాల్సిందేనని 51 శాతం మంది అన్నారు. ఫోన్లో మాట్లాడేందుకు 3 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నట్టు వీరు తెలిపారు. దురలవాట్లు స్నేహితుల నుంచే సోకుతాయని 62 శాతం మంది చెప్పారు. కెరీర్ నిర్మాణానికి ఆదర్శం తల్లిదండ్రులే అంటున్నారు. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య స్నేహం అవసరం లేదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఫ్యాషన్లలో కూడా స్నేహితుల్నే ఆదర్శంగా తీసుకుంటారని వీరు పేర్కొన్నారు. అందరూ ప్రభుత్వ ఉద్యోగానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు.