: మోడీ, రాహుల్.. దొందూదొందే: హజారే
అవినీతిపై కత్తులు దూసే అన్నా హజారే తాజా రాజకీయపరిణామాలపై స్పందించారు. నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలను నిశితంగా విమర్శించారు. హుందాతనానికి మారుపేరైన ప్రధాని పదవికి వీరిద్దరూ తగరని కుండబద్ధలుకొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో జనతంత్ర యాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న హజారే, ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానిగా వీరిద్దరిలో ఎవరూ తనకు ఆమోదయోగ్యులు కారని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్ లో లోకాయుక్తకు మోడీ అనేక అడ్డంకులు సృష్టించారని హజారే ఈ సందర్భంగా ఆరోపించారు.