: నిజమే, హైదరాబాదులో రోడ్లు ప్రాణాంతకం: కమిషనర్
నగరంలోని రోడ్లు ప్రాణాంతకంగా మారిన మాట నిజమేనని హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణబాబు ఒప్పుకున్నారు. భారీ వర్షాల వల్ల రోడ్లపై గోతులకు మరమ్మతులు చేపట్టలేకపోయినట్లు చెప్పారు. మరో 15 రోజుల పాటు వాహనదారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు మట్టితో గోతులను పూడ్చే పనిలో ఉన్నట్లు తెలిపారు.