: శునకాల కోసం ప్రత్యేకంగా టీవీ చానల్


యజమానులు బయటికెళ్ళినపుడు ఇంట్లో బోర్ గా ఫీలవుతున్న కుక్కలకు వినోదం పంచేందుకు ప్రత్యేకంగా, ప్రపంచంలోనే తొలిసారిగా ఓ శునక చానల్ వచ్చేస్తోంది. దీని పేరు డాగ్ టీవీ. వచ్చే నెల నుంచి అమెరికాలో దీని ప్రసారాలు ప్రారంభం కానున్నాయి. అమెరికాలో 4.6కోట్ల ఇళ్లలో ఉన్న కుక్కలను ఆకట్టుకోగలమని చానల్ భావిస్తోంది. నాలుగు కాళ్లున్న మన ఫ్రెండ్స్ కోసం ఈ చానల్ అంకితమని డాగ్ టీవీ సీఈఓ గిలాడ్ న్యూమన్ చెప్పారు. దృశ్యాలు, యానిమేషన్లు, సంగీతంతో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఒత్తిడిలో ఉన్న కుక్కలకు విశ్రాంతి కల్పించేందుకు డాగ్ టీవీ కార్యక్రమాలు ఉపకరిస్తాయని వెస్ట్ మినిస్టర్ కెన్నెల్ క్లబ్ డైరెక్టర్, డాగ్ షో నిర్వాహకుడు డేవిడ్ ఫ్రే అభిప్రాయపడ్డారు. నిపుణుల సలహాలతో కుక్కల కంటి చూపు, వినికిడి స్థాయికి తగినట్లు కార్యక్రమాలను రూపొందించారు. ఈ చానల్ ప్రసారాల కోసం నెలకు 5 డాలర్ల చందా చెల్లించాల్సి ఉంటుంది. విజయవంతం అయితే, తర్వాత ఈ ప్రసారాలను ప్రపంచవ్యాప్తం చేయాలని చానల్ నిర్వాహకుల యోచన.

  • Loading...

More Telugu News