: ఇంకో 5 అడుగులు చాలు.. శ్రీశైలం జలాశయం ఫుల్!
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 855 అడుగులు కాగా, ఇప్పటికే 850 అడుగులకు చేరుకుంది. ఇంకో ఐదడుగుల నీటిమట్టం పెరిగితే పూర్తిగా నిండుతుంది. ప్రస్తుతం జలాశయానికి 2,71,872 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేసేందుకు అవసరమైన నీటిని వదులుతున్నారు.