: పనిలేకే.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల రాజీనామాలు: బొత్స
వైఎస్సార్సీపీ నేతలకు వేరే పని లేదని, సీమాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేయడం వల్ల జరిగేది ఏమీ లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ నేతలు చేశారంటున్న రాజీనామాలు తన వద్దకు రాలేదని, వస్తే అప్పుడు మాట్లాడతానని స్పష్టం చేశారు. సీమాంధ్ర నేతలు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారన్న ప్రశ్నకు ఎవరి వాక్ స్వాతంత్ర్యపు హక్కులను తాము కాలరాయట్లేదని, ఇరు ప్రాంతాల నేతలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని, అవి వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలని అన్నారు. పార్టీ మొత్తం ఏకతాటిపై ఉందని అధిష్ఠానం నిర్ణయానికి అందరమూ కట్టుబడి ఉంటామని బొత్స తెలిపారు.