: భారతీయులు కోపాన్ని నియంత్రించుకోవాలి: రాహుల్ గాంధీ


భారతీయులు కోపాన్ని నియంత్రించుకోవడం అవసరమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచించారు. దానివల్ల అందరూ ఒకే విధంగా ఆలోచించగలరని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గం అమేథీలో పర్యటిస్తున్న రాహుల్ చివరిరోజు... బహ్దర్ లోని త్రిశుందిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ పీఎఫ్)శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన రాహుల్... యూపీలోని తొలి సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రాన్ని అమేథీ ప్రజలు స్వాగతించాలని కోరారు.

ఈ సమయంలో ఓ సంఘటనను గుర్తు చేసుకున్న రాహుల్... గతంలో 1990లో తీవ్రవాది అయిన ఓ వ్యక్తి పంజాబ్ నుంచి తన వద్దకు వచ్చాడన్నారు. ఒకప్పుడు తను మా కుటుంబాన్ని చంపడానికి వచ్చినట్లు చెప్పాడని తర్వాత అతనిలో మార్పు వచ్చిందన్నారు. సోదరి ప్రియాంకతో అమేథిలో రాహుల్ మూడు రోజులు పర్యటించారు. పలువురు పార్టీ కార్యకర్తలతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News