: ఆర్ఎస్ఎస్ బాంబుల తయారీలో శిక్షణ ఇస్తోంది: దిగ్విజయ్


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్.. బాంబుల తయారీలో శిక్షణ ఇస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. మధ్యప్రదేశ్ లోని నీమూచ్ లో నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంతకుముందు జరిగిన పలు సంఘటనలు ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయని చెప్పారు. 1992లో నీమూచ్ లోని ఆర్ఎస్ఎస్ సేవాభారతి కార్యాలయంలో బాంబు పేలి ఓ వ్యక్తి మరణించాడని దిగ్విజయ్ గుర్తు చేశారు. అయితే, తాము 1993లో అధికారంలోకి రాగానే ఈ విషయమై పునఃదర్యాప్తు ప్రారంభిస్తే.. కాషాయదళానికి మద్దతు పలికే ఓ పాఠశాల ప్రిన్సిపాల్ దోషిగా తేలాడని వివరించారు. అతన్ని అరెస్టు చేసి విచారిస్తే ఆర్ఎస్ఎస్ బాంబు శిక్షణ వ్యవహారం వెల్లడైందని తెలిపారు.

  • Loading...

More Telugu News