: మెర్సిడెస్ కొత్త కారు మరింత ప్రియం


కార్లపై కాస్త పరిజ్ఞానమున్న ఎవరినయినా, ఏ కారు హోదాకు మారుపేరులా నిలుస్తుందని అడిగితే.. మెర్సిడెస్ బెంజ్ అని తడుముకోకుండా చెబుతారు. తాజాగా, ఈ సంస్థ మరింత ఖరీదైన కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. విలాసవంతమైన కార్లకు చిరునామాగా ఉన్న మెర్సిడెస్ బెంజ్ కోటీ 29 లక్షల రూపాయల విలువ చేసే ఈ63 ఏఎమ్జీ అనే కొత్త కారును మార్కెట్ లోకి ప్రవేశపెట్టింది. కొత్త మోడల్ తో భారత దేశంలో తమ మార్కెట్ పెరుగుతుందని ఆ సంస్థ భావిస్తోంది. మెర్సిడెస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో ఎబరార్డ్ కెర్న్ మాట్లాడుతూ ఇప్పటివరకూ భారత్ లో ప్రవేశపెట్టిన అన్ని బెంజ్ మోడళ్లకు మంచి ఆదరణ లభించిందని, ఈ63 ఏఎమ్జీ కారుకి కూడా అంతే ఆదరణ లభిస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News