: సినీ ఫక్కీలో ఇరాక్ మిలిటెంట్ల దాడులు
ఇరాక్ లో మిలిటెంట్లు చెలరేగిపోతున్నారు. సాయుధుల ఘాతకాలతో ఇరాక్ రక్తమోడుతోంది. తెలుగు సినిమా తరహాలో కొంత మంది సాయుధులు బాగ్థాద్ నుంచి కిర్కుక్ వెళ్లే ప్రధాన రహదారిలో నకిలీ చెక్ పోస్టు ఏర్పాటు చేసి, ఆ దారిలో వెళ్తున్న ట్రక్కులన్నింటినీ ఆపి డ్రైవర్లను కాల్చేసి వాటితో పరారయ్యారు. చనిపోయిన 14 మందిని ట్రక్కు డ్రైవర్లుగా స్థానిక పోలీసులు గుర్తించారు. రంజాన్ నెల ఆరంభం నుంచి ఇప్పటి వరకు అధికారుల లెక్కల ప్రకారం పలు హింసాత్మక ఘటనల్లో 300 మంది ఇరాక్ లో అసువులు బాసారు.