: కదులుతున్న రైల్లో మహిళపై అత్యాచారం


బీహార్ లో మహిళలపై దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. 25 ఏళ్ల వివాహిత తన నాలుగేళ్ల కుమార్తెతో కలిసి రైల్లో ప్రయాణిస్తుండగా అత్యాచారానికి గురైంది. బీహార్ లోని సహార్సా జిల్లాకు చెందిన ఓ మహిళ హర్యానాలోని తన సోదరిని చూసి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గోరఖ్ పూర్-ముజఫర్ పూర్(55030) పాసింజర్ రైలులో జనరల్ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తుండగా, భోజనం చేద్దాం రమ్మంటూ ఆహ్వానించిన ఇద్దరు ప్రయాణీకులు ఆమెపై దారుణానికి తెగబడ్డారు. రైలు నార్కిటియాగంజ్ చేరుకోగానే ఆమె జీఆర్పీ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమయిన రైల్వే పోలీసులు ముజఫర్ పూర్ జీఆర్పీ పోలీసులను అలెర్ట్ చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ తాము టీటీఈలమని చెప్పుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపారు.

  • Loading...

More Telugu News