: సబిత, ధర్మానల కస్టడీపై తీర్పు వాయిదా
మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులను జుడీషియల్ కస్టడీకి పంపాలంటూ సీబీఐ దాఖలు చేసిన మెమోపై హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ పూర్తయింది. న్యాయస్థానం తీర్పును ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వీరిద్దరూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.