: బాబూ.. నువ్వు ఏ రాష్ట్రానికి సీఎం అవుతావు: బీజేపీ సూటి ప్రశ్న


తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలపై భారతీయ జనతా పార్టీ స్పందించింది. తాజా ఫలితాలతో పొంగిపోతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే దఫా తానే సీఎం అంటున్నారని, ఆయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారో స్పష్టం చేయాలంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణపై స్పష్టమైన వైఖరిని చెప్పని బాబు, ముందు ఆ విషయమై తన అభిప్రాయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. గత ఉపఎన్నికల్లో పార్టీ గుర్తులపై పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు.. నేడు ఇతర గుర్తులపై జరిగిన పంచాయతీ ఎన్నికల విజయాలను తమతమ ఖాతాల్లో వేసుకోవడం అవివేకమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

తమదే మెజారిటీ అని రెండు పార్టీలు చంకలు గుద్దుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. మలి విడత ఎన్నికలను ప్రభావితం చేసేందకే ఈ రెండు పార్టీలు ఈ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా సీఎం కిరణ్.. సోనియాకు తప్పుడు నివేదికలు పంపుతూ అధిష్ఠానం ప్రాపకం కోసం పాకులాడతున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.

  • Loading...

More Telugu News