: అడ్డంగా దొరికిపోయిన 34 లక్షలు
గుంటూరు జిల్లాలో వేర్వేరు ఘటనల్లో 34 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. పెదనందిపాడు-పర్చూరు రహదారిలోని చెక్ పోస్టు వద్ద పోలీసులు జరిపిన వాహన తనిఖీల్లో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న 30 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. మరో ఘటనలో తాడేపల్లి మండలంలోని దుర్గమ్మ వారధి వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 4 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.