: సెంటిమెంట్ విలువ 17 కోట్లు


ముంబై రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసిన ధరకు ఓ బిల్డర్ స్వంత ఇంటిని కొనుక్కున్నారు. అతని ఇంటి ధర సుమారు 17 కోట్లు అయింది. గౌతమ్ అహూజా అనే కన్స్ ట్రక్షన్ సంస్థ అధిపతి బాంద్రాలో తన తండ్రికి, కుటుంబానికి దగ్గరగా ఉండాలన్న సెంటిమెంట్ తో వారు ఉంటున్న పాత అపార్ట్ మెంట్ లోనే ఓ ఫ్లాట్ ను 16 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నారు. అంటే ఒక చదరపు అడుగు 97 వేల రూపాయలు పలికింది. దీనికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ కలిపి 17 కోట్లు కానుంది. అసలు బాంద్రా ప్రాంతంలో కొత్త భవనాలకు ఇప్పటి వరకూ చదరపు అడుగు అత్యధిక ధర 70 వేలే ఉంది.

ఇంత ధరపెట్టి ఎందుకు కొన్నాడంటే అతను పుట్టిన దగ్గర్నుంచీ ఇదే ఫ్లాట్ లో ఉన్నారు. ఆ సెంటిమెంట్ ఆధారంగానే అంత ఎక్కువ ధర చెల్లించి మరీ అదే ఫ్లాట్ లో ఈ ఇల్లు కొన్నారు. దీంతో స్థిరాస్తి రంగం కుదుపుకు లోనైంది. కళ్లు బైర్లు కమ్మే ధరకు అహూజా ఇల్లు కొనడంతో ముంబైలోని రియల్ ధరలు పెరుగుతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News