: ఈ సాయంత్రం తెలంగాణ మంత్రుల సమావేశం


తెలంగాణ మంత్రులు ఈ సాయంత్రం హైదరాబాదులో సమావేశం కానున్నారు. ఈ విషయమై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి ఫోన్ చేసి టీ మంత్రులకు స్వయంగా సమాచారం అందించారు. 26న కోర్ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హస్తినలో మకాం వేశారు. మరోవైపు, నిన్న ప్రత్యేకంగా సమావేశమైన సీమాంధ్ర మంత్రులు రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు. అటు, వీరశివారెడ్డి వంటి ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో, భవిష్యత్తులో పక్కాగా అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News