: హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న టాబ్లెట్ పీసీలు


వినియోగదారుల ఆదరణ విషయంలో టాబ్లెట్ పీసీలు దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం వీటినే వినియోగదారులు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో దేశంలో అమ్ముడుపోయిన టాబ్లెట్లు 3.6లక్షలు. ఆ తర్వాత సంవత్సరం అంటే 2012-13లో ఐదు రెట్లకు పైగా పెరిగి 19 లక్షలు అమ్ముడయ్యాయి. ఇదే ఏడాది డెస్క్ టాప్ కంప్యూటర్ల అమ్మకాలు కేవలం 1 శాతం మాత్రమే వృద్ధి చెందాయి. వీటి అమ్మకాలు 67.69 లక్షలుగా ఉన్నాయి. ఇక స్మార్ట్ ఫోన్లు అయితే కోటిన్నర అమ్ముడుపోయాయి. ప్రధానంగా యువత విభిన్నమైన యాప్స్ కోసం స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News