: ఎన్నికలు రద్దయిన పంచాయతీలకు తాజా నోటిఫికేషన్


ఎన్నికలు రద్దయిన 18 పంచాయతీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 8న పోలింగు నిర్వహించనున్నట్లు తెలిపింది. నామినేషన్లను ఈ నెల 29 వరకు స్వీకరిస్తామని, 30న నామినేషన్లు పరిశీలించి, ఆగస్టు 2న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. సర్పంచిని ఎన్నుకునేందుకు వేలం జరిగిందని రుజువు కావడంతో ఈ పంచాయతీలకు తొలి విడత ప్రకటించిన ఎన్నికలు రద్దయ్యాయి.

ఇక, వివిధ కారణాలతో వాయిదా పడిన.. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం యలమగూడ పంచాయతీ, కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి పంచాయతీలోని 19వ వార్డు, మెదక్ జిల్లా మగ్దూంపూర్ లోని 8వ వార్డుకు ఆగస్టు 8న పోలింగు జరుగుతుందని తెలిపింది. అటు రేపు సాయంత్రంలోగా రెండోదశ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియనుంది.

  • Loading...

More Telugu News