: లక్ష టవేరా కార్లను వెనక్కి రప్పించుకున్న జనరల్ మోటార్స్
జనరల్ మోటార్స్ ఇండియా సంస్థ 1.14 లక్షల షెవర్లె టవేరా కార్లను(ఎంయూవీ) ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. 2005-13 మధ్య తయారైన ఈ లక్షా 14 వేల కార్లను ఎమిషన్, స్పెసిఫికేషన్ అంశాలకు సంబంధించిన లోపాలతో వెనక్కి తీసుకుంటున్నట్టు సంస్ధ తెలిపింది. జీఎంఐకి చెందిన 280 మంది డీలర్ల వద్ద ఈ లక్షా 14 వేల కార్లను పైన పేర్కొన్న అంశాలకు సంబంధించిన మరమ్మత్తులను ఉచితంగా చేసి ఇవ్వనున్నారు. ప్రస్తుతం జనరల్ మోటార్స్ ఇండియా సంస్ధ టవేరా మోడల్ కార్లను తాత్కాలికంగా నిలిపివేసింది.