: తెరపైకి 'తెలుగునాడు' రాష్ట్రం
రాష్ట్ర విభజన అంశంలో మరో కొత్తకోణం తెరపైకి వచ్చింది. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే.. 12 జిల్లాలతో 'తెలుగునాడు' రాష్ట్రాన్ని ప్రకటించాలంటున్నారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య. తెలంగాణ ప్రాంతానికి చెందిన పది జిల్లాలతో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాలను కొత్త రాష్ట్రంలో కలిపేయాలని సూచిస్తున్నారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే 'తెలుగునాడు' ఉద్యమం ఆరంభిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్రం ఏర్పడాలన్నారు.