: క్రికెటర్ పియూష్ చావ్లా నిశ్చితార్ధం
ఉత్తరప్రదేశ్ క్రికెటర్ పియూష్ చావ్లా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. మంగళవారం మొరాదాబాద్ లోని ఓ హోటల్ లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో స్నేహితురాలు అనుభూతి సింగ్ తో పియూష్ నిశ్చితార్ధం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రెండు కుటుంబాలకు చెందిన వారు, స్నేహితుల సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. అయితే, పెళ్లి తేదీ ఇంకా నిర్ణయించలేదు.