: హౌరాలో ముంబై టీవీ యాంకర్ కు వేధింపులు


ముంబైకి చెందిన ఓ టీవీ యాంకర్ కు హౌరాలో చేదు అనుభవం ఎదురైంది. కోల్ కతాను చూద్దామని ముంబై నుంచి వచ్చిన టీవీ యాంకర్ రైల్వేస్టేషన్ నుంచి తన మిత్రుడు, తండ్రితో కలిసి స్థానిక చేపల మార్కెట్ మీదుగా వెళుతుండగా, అక్కడి రెస్టారెంట్ వద్ద భోజనం కోసం కారు ఆపింది. ఇంతలో రతన్ సాహు అనే వ్యక్తి కారులోంచి యాంకర్ ను బయటికి లాగేందుకు ప్రయత్నించాడు. ఇది అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడ్ని చితక్కొట్టాడు. దాన్ని స్థానికులు చోద్యం చూస్తున్నట్టు చూశారు కానీ ఎవరూ అడ్డుకోలేదు. అనంతరం ఆ మహిళ.. తన మిత్రుడు, తండ్రి సహాయంతో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిని అరెస్టు చేసిన పోలీసులు కాసేపటి తరువాత విడుదల చేయడం గమనార్హం. అతడిని విడుదల చేసేందుకు దీదీ (మమతా బెనర్జీ) పార్టీకి చెందిన వ్యక్తులు సాయం చేయడం విస్మయం కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News