: తిరుమల నుంచి శ్రీశైలానికి చేరుకున్న బంగారు రేకులు
తిరుమల నుంచి బంగారు తాపడం చేసిన రేకులు శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి చేరుకున్నాయి. వీటిని భ్రమరాంభ అమ్మవారి ఆలయ విమాన గోపురానికి అమర్చనున్నారు. ఇందుకోసం, వీటిని తిరుమలలో ప్రత్యేకంగా తయారు చేయించారు. వీటిలో 80 శాతం శ్రీశైలానికి రాగా, మరో 20 శాతం రేకులు త్వరలోనే రానున్నాయని ఆలయ ఈవో చంద్రశేఖర ఆజాద్ చెప్పారు.