: 'హైదరాబాదు ఉమ్మడి రాజధాని'కి సీపీఐ ఓకే


తెలంగాణ రాష్ట్రం ఇస్తే కొంతకాలం పాటు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచడం మంచిదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి లీకేజీ వార్తలతో అవకాశవాద రాజకీయాలకు తెరదీస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసం ఈ నెల 28న హైదరాబాదులో ఐదు కమ్యూనిస్టు పార్టీలతో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ వస్తే దొరల పెత్తనాన్ని అడ్డుకునేందుకు వామపక్ష పార్టీలు కలిసి ఉద్యమం చేపడతాయని వెల్లడించారు.

  • Loading...

More Telugu News