: సినిమా నిర్మాతలకు గోవా సింగిల్ విండో అనుమతులు


సినిమాలు తీయడానికి వచ్చే వారికి సింగిల్ విండో (ఏక గవాక్ష) అనుమతులు ఇవ్వాలని గోవా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ పలురకాల ఏజెన్సీల నుంచి అనుమతులు తీసుకునే ప్రక్రియ క్లిష్టతరంగా ఉండడంతో దీన్ని సులభతరం చేయాలని, నిన్న సాయంత్రం పనాజీలో జరిగిన సమావేశంలో గోవా మంత్రిమండలి నిర్ణయించింది. మరోవైపు 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్'ను తాము సొంతంగా నిర్వహిస్తామని గోవా ప్రభుత్వం ఆసక్తి వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ దృష్టికి తీసుకెళ్లాలని గోవా ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'ఎంటర్ టైన్ మెంట్ సొసైటీ ఆఫ్ గోవా' నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News