: మమ్మల్ని రెచ్చగొట్టొద్దు: కోదండరాం
రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే సమయంలో, సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సచివాలయంలో దస్త్రాలు తగులబెడుతుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. విభజనకు అందరూ సహకరించాలని, రాష్ట్రాన్ని తక్షణం ప్రకటించాలని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కోదండరాం హెచ్చరించారు.