: త్వరలో పెట్రోల్ బంకుల్లో 5కేజీల గ్యాస్ సిలిండర్లు


5 కేజీల చిన్న వంటగ్యాస్ సిలిండర్లు హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలలో అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వరంగ పెట్రోల్ బంకుల్లో 5కేజీల రీఫిల్ సిలిండర్ల విక్రయానికి సంబంధించిన ప్రతిపాదనకు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఆమోదం తెలిపారు. ఒక్కో సిలిండర్ ధర 361 రూపాయలుగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి చిన్న సిలిండర్లను బ్యాచిలర్స్, పేదలు, షాపుల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. చట్ట విరుద్ధంగా షాపులవారే ఈ సిలిండర్లలో గ్యాస్ నింపి విక్రయిస్తుంటారు. ప్రభుత్వమే వీటిని అందుబాటులోకి తెస్తే ఇక అలాంటి అక్రమాలను నిరోధించవచ్చు.

  • Loading...

More Telugu News