: ప్రేమే నేరమా?


మనలో ప్రేమ అనే భావన ఉంటే దీనివల్ల మన జీవితంలోని విషాద సంఘటనలను మరిచిపోలేరని తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. మనలోని ప్రేమకు సంబంధించిన హార్మోను బాధలను అంత త్వరగా మరిచిపోకుండా ఉండేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అమెరికాలోని నార్త్‌వెస్టర్న్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో మనలోని భావోద్వేగాలకు సంబంధించిన ప్రేమహార్మోన్‌ ఆక్సీటోసిస్‌తో ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయని తేలింది. ఆక్సీటోసిస్‌ హార్మోన్‌ ప్రేమ, సామాజిక భావోద్వేగాలకు సంబంధించింది. ఈ హార్మోను మన జీవితంలోని విషాద సంఘటనలు చెరిగిపోకుండా అలాగే కొనసాగేలా చేస్తుందని, మనలో భయం ఆదుర్దాలను పెంచుతుందని కూడా ఈ పరిశోధనలో తేలింది. మన నిత్యజీవితంలో మనకు నచ్చని అనుభవం ఏదైనా ఎదురైతే అప్పుడు ఒత్తిడికి గురయ్యే ఆక్సీటోసిస్‌ మెదడులోని ఒక ప్రాంతాన్ని చైతన్య పరుస్తుందని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఈ కారణంగా ఆ విషాద సంఘటనకు సంబంధించిన జ్ఞాపకం మన మెదడులో స్థిరపడిపోతుందని, ఒత్తిడిని కలిగించే సందర్భాల్లో ఆక్సీటోసీస్‌ మరింతగా ఆందోళనకు గురిచేస్తోందని, మనకు మరింతగా భయాన్ని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆక్సీటోసిస్‌ వల్ల అటు మేలే కాకుండా ఇలా కీడు కూడా జరిగే అవకాశం ఉందని, కాబట్టి ఆ హార్మోన్‌ సమతుల్యతను కాపాడేలా సరైన వైద్యం అందించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జెలెనా రాడ్యులొవిక్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News