: పళ్లు, కూరగాయలతో క్యాన్సర్‌ దూరం


క్యాన్సర్‌ వ్యాధి వచ్చిన తర్వాత తీసుకునే చికిత్సకన్నా అసలు క్యాన్సర్‌ రాకుండానే ముందుగా మన ఆహారంలో తగు మార్పులు తీసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సరైన పోషకాహారం తీసుకుంటే ఎలాంటి వ్యాధులు రావు అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పోషకాహారంలో ముఖ్యంగా పళ్లు, కూరగాయలు, బీన్స్‌, పప్పుదినుసులు వంటివాటిని ఎక్కువగా తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకులు సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చని చెబుతున్నారు. మన ఆహారంలో పళ్లు, కూరగాయలు, బీన్స్‌, పప్పుదినుసులు, ధాన్యాలువంటివి తినడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే తీపి బంగాళాదుంపలు, బచ్చలి కూర, పండు మిరపకాయలు వంటివి తినడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్‌ను మరింత దూరంగా ఉంచవచ్చని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. పిండి పదార్ధాలు, కొబ్బరినూనె, ఆలివ్‌ ఆయిల్‌, నాణ్యమైన ప్రోటీన్లను తీసుకోవడం వల్ల కూడా రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తమ పరిశోధనలో వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాలు, వెన్న, ఐస్‌క్రీం వంటివాటిని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని వీరు హెచ్చరిస్తున్నారు. అలాగే తీపి పానీయాలు, సోడియంతో తయారైన ఆహార పదార్థాలు, పొగతాగడం, పొగాకు ఉత్పత్తులను నమలడం వంటి వాటివల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News