: ఆసీస్ కు 5-0 ఓటమి తప్పదు: మెక్ గ్రాత్
ప్రస్తుతం ఆసీస్ క్రికెట్ జట్టు ఆటతీరు పాతాళానికి పడిపోయిందని దిగ్గజ పేసర్ గ్లెన్ మెక్ గ్రాత్ అంటున్నాడు. తాజా యాషెస్ లో క్లార్క్ సేనకు 5-0తో వైట్ వాష్ తప్పదని హెచ్చరిస్తున్నాడు. గార్డియన్ పత్రికకు రాసిన ఓ వ్యాసంలో మెక్ గ్రాత్ తన అభిప్రాయాలు వెల్లడించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ గడ్డపై పర్యటిస్తున్న ఆసీస్ జట్టు తొలి రెండు టెస్టులను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెక్ గ్రాత్ జట్టుకు పలు సలహాలిచ్చాడు. ఆస్టన్ అగర్ స్థానంలో అనుభవశాలి నాథన్ లియాన్ కు చోటు కల్పించాలని సూచించాడు. ఇప్పటికే సిరీస్ లో 0-2తో వెనకబడినా కోలుకోవడం కష్టమేమీ కాదని అన్నాడు. అయితే, టాపార్డర్ బ్యాట్స్ మెన్ తమ వికెట్ విలువ గుర్తెరిగి ఆడాలని చెప్పాడు. నిర్లక్ష్య ధోరణి వీడకుంటే, కొందరు ఈ సిరీస్ అనంతరం కెరీర్ ముగించాల్సి ఉంటుందని హెచ్చరించాడు.