: ప్రజలు మా పక్షానే ఉన్నారు: టీడీపీ
పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. సర్పంచి ఓట్ల లెక్కింపులో తమ మద్దతుదారులు ఇప్పటివరకు 811 పంచాయతీలు కైవసం చేసుకోవడం పట్ల టీడీపీ వర్గాల్లో ఆనందం అంబరాన్నంటుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ నేత కంభంపాటి రామ్మోహనరావు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలు టీడీపీ వైపే ఉన్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక వైఎస్సార్సీపీ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని కంభంపాటి హితవు పలికారు. టీడీపీ జోరుతో ఏం చేయాలో పాలుపోని ఓ చానల్ అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు.