: కడపలో తిరుగులేని జగన్ పార్టీ
పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సీమాంధ్ర జిల్లాల్లో జగన్ పార్టీ జోరు కనబరుస్తోంది. ఓవైపు కాంగ్రెస్, టీడీపీ హోరాహోరీ పోరాటం కొనసాగుతుండగా.. మరోవైపు వైఎస్సార్సీపీ పలు పంచాయతీలను కైవసం చేసుకుని పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. జగన్ స్వంత జిల్లా కడపలోఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది. వైఎస్సార్సీసీపీ మద్దతుతో 85 మంది సర్పంచ్ లు గా జయభేరి మోగించగా.. కాంగ్రెస్ 38, టీడీపీ 17, ఇతరులు 14 పంచాయతీల్లో నెగ్గారు. కాగా, తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పార్టీ మద్దతిస్తున్న సర్పంచ్ అభ్యర్థులు 38 మంది గెలవగా.. కాంగ్రెస్ 25, టీడీపీ 35 పంచాయతీలు దక్కించుకున్నాయి. ఇక విశాఖపట్నంలోనూ వైఎస్సార్సీపీ హవా కొనసాగింది. ఆ పార్టీకి ప్రస్తుతం 25 పంచాయతీలు దక్కగా.. కాంగ్రెస్ 10, టీడీపీ 15 పంచాయతీలు చేజిక్కించుకున్నాయి.